బజార్ హత్నూర్ : ఆధ్యాత్మిక చింతనతోనే మానసిన ప్రశాంతత నెలకొంటుందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (MLA Anil Jadhav) అన్నారు . పూలజీ బాబా (Phulaji Baba) ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా గురువారం కోలారి గ్రామంలో నిర్వహించిన ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనను అలవార్చుకోవాలని, చెడు అలవాట్లకు వెళ్లవద్దని చూచించారు. ఆలయ అభివృద్ధి కి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని వెల్లడించారు. ఆలయ ప్రాంగణంలో రేకుల షెడ్డు నిర్మించేలా చూస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ మండల కన్వీనర్ రాజారాం, నాయకులు చిలుకూరి భూమయ్య, కుర్మే లక్ష్మన్, యువజన సంఘం అధ్యక్షులు శేఖర్, దీసి రమణ, పర్చ సాయన్న, జల్కె పాండురంగ్, జనార్దన్, శరత్ అరుణ్,రియాజ్, శంకర్ ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.