నార్నూర్ : గిరిజన ప్రజలకు వైద్య సేవలు అందించాలంటే వాగులు( Streams) , వంకలు దాటి వైద్యం అందించే పరిస్థితి నెలకొందని ఝరి ప్రాథమిక ఆరోగ్య వైద్య సిబ్బంది ( Primary Health Staff ) వాపోయారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మలంగి పంచాయతీ పరిధి బారిక్ రావుగూడ గ్రామ సమీపంలోని వాగును దాటి వైద్య సేవలు అందించారు.
గ్రామంలో రాపిడ్ ఫీవర్ సర్వే పకడ్బందీగా నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి స్థానికుల వివరాలు నమోదు చేశారు. ఈ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ ఆడే సంజయ్ మాట్లాడుతూ ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ముందస్తు చర్యలుగా గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. బారిక్ రావు గూడ గ్రామానికి వెళ్లి వైద్యం అందించాలంటే సమీపంలోని వాగును దాటి వెళ్లాల్సిందే అన్నారు. ఆయన వెంట వైద్య సిబ్బంది ఉన్నారు.