ఆసిఫాబాద్ టౌన్, ఏప్రిల్ 15 : స్కూటీ డిక్కీ నుంచి నగదు దొంగిలించిన వ్యక్తిని కేవలం 40 నిమిషాల్లోనే పోలీసులు పట్టుకొని శభాష్ అనిపించుకున్నారు. ఆసిఫాబాద్ సీఐ రవీందర్ కథనం ప్రకారం.. జిల్లా కేంద్రానికి చెందిన మీర్అలీ గాంధీ చౌక్ వద్ద స్కూటీ పార్కిం గ్ చేశాడు. ఓ దొంగ సూటీ డికీలో ఉన్న రూ. 36 వేలు ఎత్తుకొని పారిపోయాడు.
వెంటనే బాధితుడు పో లీసులకు ఫిర్యాదు చేయగా సీఐ ఆధ్వర్యంలో బ్లూకో ల్ట్స్ సిబ్బంది తిరుపతి, సాగర్ చోరీ జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల ఆధారంగా దొంగను గుర్తించి పట్టుకున్నారు. రూ. 36 వేలు స్వాధీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దొం గను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, ఏఎస్పీ చిత్తరంజన్, సీఐ రవీందర్, ఎస్ఐ అంజయ్య అభినందించారు.