మంచిర్యాలటౌన్, మార్చి 17 : 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా 12 రోజులే ఉంది. ఈ లోగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో వంద శాతం ఆస్తిపన్ను వసూలు లక్ష్యాన్ని చేరుకోవడం సందేహంగానే ఉంది. మంచిర్యాల మున్సిపాలిటీ జనవరి 27 నుంచి కార్పొరేషన్‌గా మారడం, ఇందులో నస్పూర్ మున్సిపాలిటీతో పాటు హాజీపూర్ మండలంలోని ఎనిమిది గ్రామా లు విలీనమయ్యాయి. ఈ ప్రాంతాల్లో పన్ను వసూళ్ల కోసం కార్పొరేషన్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో 45327 భవనాలు ఉన్నాయి. వీటిలో 41479 నివాస భవనాలు, 1977 కమర్షియ ల్ భవనాలు, 1871 మిక్స్డ్ ఉపయోగిత భవనాలున్నాయి.
వీటి మీద ఏడాదికి రూ. 26.87 కోట్లు పన్ను వసూలు లక్ష్యంగా ఉం డగా ఇప్పటివరకు కేవలం రూ. 11.93 కోట్లు (44.35 శాతం) మాత్రమే వసూలు చేశారు. మార్చి నెలాఖరులోగా సాధ్యమైనంతగా ఆస్తిపన్ను వసూలు చేయడంపై కార్పొరేషన్ అధికారులు దృష్టి నిలిపారు. కార్యాలయంలోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, సి బ్బందిని పన్ను వసూళ్లకోసం నియమించా రు. ఆస్తిపన్ను వసూలుకోసం ప్రతిరోజూ ఉద యం 8 గంటలకే విధుల్లో వెళ్లి పన్ను బకాయి ఉన్న భవనాల యజమానులను నేరుగా కలిసి పన్నులు చెల్లించాలని కోరుతున్నారు.
మొండి బకాయిదారులకు ఇప్పటికే రెడ్‌నోటీసులు అందించారు. ఇంటింటికీ చెత్తను సేకరించే వాహనాల ద్వారా మైకులలో ప్రచారం చేస్తున్నారు. పట్టణంలోని 15 ప్రధాన కూడళ్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మార్చి నెల మొద టి వారం నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న అధికారులు పన్ను చెల్లించని భవన యజమానుల ఆస్తుల జప్తుకు నిర్ణయం తీసుకున్నారు. స్పందించని యజమానులకు సంబంధించిన ఇండ్లు , దుకాణాలకు తాళాలు వేస్తున్నారు. ఇంట్లో ఉన్న టీవీ, సోఫా, ఫ్రిజ్‌లు తీసుకువెళ్తామని ముందస్తు హెచ్చరికలు జారీచేస్తున్నారు. పలుచోట్ల అధికారులతో భవన యజమానులు వాదనలకు దిగుతున్నారు.