ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, జూలై 27 : నేరాల నియంత్రణలో డయల్ 100, 112 సిబ్బంది పాత్ర కీలకమని అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు జిల్లా పోలీసు అధికారులతో అదనపు ఎస్పీ డయల్ 100పై సమావేశం నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ డయల్ 100, 112కి వచ్చిన ఫోన్లకు తక్షణమే స్పందించి ఘటనా స్థలానికి చేరుకోవాలని, పెట్రోకార్, బ్లూ కోల్ట్స్ సిబ్బంది నిరంతరం గస్తీ నిర్వహించాలని సూచించారు. ఫోన్ పోగొట్టుకున్న వారికి సీఈఐఆర్ పోర్టల్‌లో ఫోన్ బ్లాక్ చేసి బాధితులకు సత్వర న్యాయం చేయాలన్నారు. ఆన్లైన్ మోసాలు, యాప్‌లపై నిరంతరం అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. సైబర్ నేరాలకు గురైనైట్లెతే 1930కు తక్షణమే సమాచారం అందించాలని తెలిపారు.