నార్నూర్ : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రానికి చెందిన ఆశ్రమ పాఠశాల అవుట్ సోర్సింగ్ కుక్(Out sourcing Cook) రాథోడ్ కొమురయ్య ( Komaraiah) ఆదివారం ఆకస్మికంగా మృతి చెందారు. సోమవారం నిర్వహించిన అంత్యక్రియలో జడ్పీ మాజీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీరాం జాదవ్, నార్నూర్ సహకార సంఘం చైర్మన్ ఆడే సురేష్, సర్పంచుల సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ గజానంద్ నాయక్ పాల్గొన్నారు. అనంతరం కుటుంబీకులను పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జడ్పీ మాజీ చైర్మన్ మాట్లాడుతూ.. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో అవుట్ సోర్సింగ్‌లో కుక్‌గా పని చేస్తున్న కొమరయ్య మృతి చెందడం బాధాకరమన్నారు. కొమురయ్య కుటుంబానికి రూపాయలు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆయన వెంట సేవాలాల్ ధర్మ ప్రచారక్ ఆడే ప్రేమ్ మహారాజ్, గులాబ్ మహారాజ్, మాజీ ఉపసర్పంచ్ చౌహన్ మహేందర్, జేఏసీ మాజీ చైర్మన్ రాథోడ్ ఉత్తమ్, విద్యావేత్త బాలాజీ కాంబ్లే, పీసా చట్టం కోఆర్డినేటర్ రాథోడ్ సికిందర్, బీజేపీ మండల అధ్యక్షుడు రాథోడ్ బిక్షపతి, అఖిల భారతీయ బంజారా సేవా సంఘం మండల ప్రధాన కార్యదర్శి రాథోడ్ దిలీప్, హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ సుల్తాన్ ఖాన్, సహకార సంఘం డైరెక్టర్ దుర్గే కాంతారావు, మాజీ సర్పంచ్ రాథోడ్ విష్ణు, అశోక్, సుభాష్, గుంజ చిన్నయ్య, దేవిదాస్, సురేష్, మోహన్ తదితరులు ఉన్నారు.