క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని అన్నారు. యువత వ్యసనాలకు బానిస కాకుండా మంచిమార్గంలో నడవాలని సూచించారు. సరదగా క్రీడాకారులతో కాసేపు బ్యాటింగ్ చేశారు. అంతకుముందు న్యూ అనంతపూర్ గ్రామంలో పర్యటించారు.
గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఈశ్వర్, నాయకులు రమణ, రాజు, నందు, శంకర్, జ్ఞానేశ్వర్, భోజన్న, తదితరులు పాల్గొన్నారు.