నార్నూర్/ కుభీర్ : ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి మండలంలో పొలాల అమావాస్య ( Amavasya ) పండుగను రైతులు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. బసవన్నలను ( Cattles ) చెరువులు, కుంటల వద్ద శుభ్రం చేసి రంగులు అద్ది, పూలతో అందంగా అలంకరించారు. సమీప ఆంజనేయస్వామి ఆలయాలకు ( Hanuman Temples ) తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించారు.
గ్రామ పటేల్ ఇంటి ఎదుట బసవన్నలకు ప్రత్యేక సాంప్రదాయ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతన్నలకు కానుకలు అందజేశారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం భీంపూర్ గ్రామంలో మాజీ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ పొలాల అమావాస్య వేడుకల్లో పాల్గొన్నారు. ఆదివాసి గూడెంలో బోడగ పండుగను శనివారం నిర్వహించనున్నారు.
కుభీర్‌లో..
నిర్మల్‌జిల్లా కుభీర్ మండలంలో శుక్రవారం ఎడ్ల పొలాల అమావాస్యను ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రం కుభీర్‌లో జరిగిన వేడుకలో విఠలేశ్వర ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ బి పెంటాజీ, గంగాధర్ పటేల్, ఆయా కుల సంఘాల అధ్యక్షులు, నాయకులు బోయిడి విట్టల్, ప్యాట లక్ష్మణ్, వడ్నం నాగేశ్వర్, ఏషాల దత్తాత్రి, బోయిడి అభిషేక్, కందూరి బడా సాయినాథ్, చిన్న సాయి, రైతన్నలు, యువకులు,మహిళలు గ్రామస్తులు, పాల్గొన్నారు.