వాంకిడి : పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ఖాతాదారుల దాహార్తి తీర్చేందుకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (Telangana Gramin Bank ) వాంకిడి మండల కేంద్రంలో చలివేంద్రాన్ని ( Drinking Cool Water ) ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ జాడి కృష్ణ ( Manager Krishna ) టీజీబీ ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గురువారం ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ రోజు రోజుకు ఎండలు పెరుగుతున్నాయని, బ్యాంకుకు వచ్చే ప్రజలు త్రాగు నీటి కోసం ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకొన్నామని వివరించారు. పనులు నిమిత్తం మండల కేంద్రానికి వచ్చే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ శ్రీముఖ్, సీఎస్పీ ప్రతినిధులు దుర్గం రాకేష్, రామగిరి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.