చెన్నూర్ రూరల్, ఆగస్టు 2 : తుర్కపల్లి లోని రోడ్డు అధ్వానంగా మారగా, ప్రయాణం నరకప్రాయంగా మారింది. శుక్రవారం సాయం త్రం చెన్నూర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు టాటా మ్యాజిక్‌లో తుర్కపల్లికి బయలుదేరగా, ఊరిలోకి రాగానే వెనుక టైర్లు మొ త్తం బురదలో దిగబడ్డాయి.
రోడ్డు పక్కనే పెద్ద గుంత ఉండడంతో అందులో పడిపోతామేమోనని విద్యార్థులు భయపడిపోయారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన వచ్చి బురదలో దిగబడ్డ వాహనాన్ని బయటకు నెట్టారు. దీంతో విద్యార్థు లు సురక్షితంగా బయటపడ్డారు. ఎమ్మెల్యే గడ్డం వివేక్ చొరవ తీసుకొని తుర్కపల్లికి రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు.