సిసిసి నస్పూర్: ఆదిలాబాద్ రేంజ్ ( Adilabad Range ) అవినీతి నిరోధక శాఖ డీఎస్పీగా (ACB DSP) జి మధు ( Madhu) బాధ్యతలు స్వీకరించారు. సిసిసి నస్పూర్ లోని ఆదిలాబాద్ రేంజ్, మంచిర్యాల జిల్లా ఏసీబీ కార్యాలయంలో ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించగా, ఏసీబీ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు.
ఇది వరకు ఇక్కడ పని చేసిన విజయ్ కుమార్ కరీంనగర్ రేంజ్ ఏసీబీ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో సిద్దిపేట ఏసీపీగా పనిచేసిన జి మధు ఆదిలాబాద్ రేంజ్, మంచిర్యాల అవినీతి నిరోధక శాఖ ఆఫీసుకు బదిలీపై వచ్చారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్ రేంజ్ పరిధిలో అవినీతిని రూపుమాపడానికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ అధికారులు లంచాల కోసం డిమాండ్ చేస్తే నేరుగా ఏసీబీ ఆఫీస్ కి వచ్చి ఫిర్యాదు చేయవచ్చని, టోల్ ఫ్రీ నెంబర్ 1064 సంప్రదించవచ్చని ఆయన సూచించారు.