తాండూర్ : విద్యార్థులు దేశభక్తి ( Patriotic ) భావాలను పెంపొందించుకుని, ఉన్నతమైన లక్ష్యాల వైపు అడుగులు వేయాలని మండల విద్యాధికారి ఎస్ మల్లేశం ( MEO Mallesham ), మాదారం ఎస్సై సౌజన్య( SI Soujanya) కోరారు.
నారీ యువశక్తి ఫోరం ప్రధాన కార్యదర్శి చిలుముల శ్రీకృష్ణదేవరాయలు ఆధ్వర్యంలో ఝాన్సీ లక్ష్మీబాయి( Jhansi Laxmibai ) జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల స్థాయిలో వ్యాసరచన, ఉపన్యాస పోటీలను మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ఝాన్సీ లక్ష్మీబాయి ని విద్యార్థినులందరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఆధునిక భారతదేశంలో మహిళల పాత్ర అనే అంశంపై ఉపన్యాసం, డిజిటల్ యుగంలో మహిళా రక్షణ అనే అంశంపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో తాండూర్, అచ్చలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉమాదేవి, మాజీ ఎంపీపీ సిరంగి శంకర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దత్తాత్రేయరావు, బీజేపీ సీనియర్ నాయకులు పులగం తిరుపతి, దూడపాక భరత్ కుమార్, కస్తూర్బా పాఠశాల ఉపాధ్యాయురాలు సుమన చైతన్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.