ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, డిసెంబర్ 30: నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్య లు తీసుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పేరొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం ఆసిఫాబాద్ డీఎస్పీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. డివిజన్ పరిధిలోని పోలీస్స్టేషన్ కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలని, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సూచించారు. పెండింగ్ కేసులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కరుణాకర్, పట్టణ సీఐ రవీందర్, రెబ్బెన సీఐ స్వామి, వాంకిడి సీఐ సత్యనారాయణ, జైనూర్ సీఐ రమేశ్ ఉన్నారు.