గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
ఈనెల 9న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కు మ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు.
- కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల కలెక్టర్లు వెంకటేశ్ ధోత్రే, బదావత్ సంతోష్
ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, జూన్ 7 : ఈనెల 9న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కు మ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరం లో శుక్రవారం అదనపు కలెక్టర్లు దీపక్ తివా రీ, దాసరి వేణు, అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ ఆర్డీవోలు లోకేశ్వరరావు, కాశబోయిన సురేశ్, జిల్లా ప్రాం తీయ సమన్వయకర్త లక్ష్మీ నరసింహం, ఆసిఫాబాద్ డీఎస్పీ సదయ్యతో కలిసి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో విధులు నిర్వహించే డిపార్ట్మెంట్ అధికారులు, రూట్ అధికారులు, ఐడెంటిఫికేషన్ అధికారులు, పోలీసు అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. 13 పరీక్షా కేంద్రాలు ఆసిఫాబాద్‌లో 6 కేంద్రాలు (1271 మంది అభ్యర్థులు), కాగజ్‌నగర్‌లో 7 కేంద్రాలు (1512 మంది అభ్యర్థులు) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 9 గంటలకే అభ్యర్థులు పరీ క్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. 10 గం టల తరువాత అనుమతించబోమని స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫో న్లు ఎట్టి పరిస్థితుల్లో పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేది లేదన్నారు. మహిళా అభ్యర్థులు ఆ భరణాలు ధరించి రాకూడదని అన్నారు. అభ్యర్థులు బాల్‌పెన్, హాల్ టికెట్, రెండు పా స్పోర్టు సైజ్ ఫొటోలు, ఐడీ కార్డు (ఆధార్/పాన్/డ్రైవింగ్లైసెన్స్) వెంట తెచ్చుకోవాలని సూచించారు. డిపార్ట్మెంట్ అధికారులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలను సం దర్శించి, అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లతో సమన్వయం చేసుకోవాలన్నారు. పరీక్షా సమయం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటుందని తెలిపారు. దివ్యాంగ అభ్యర్థులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఉదయం 6 గంటలకు జిల్లా కేంద్రంలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచిన వాటిల్లో నిర్ణయించిన ప్రశ్నాపత్రాలను తమకు కేటాయించిన కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లకు పోలీస్ బందోబస్తు నడుమ అందించాలని రూట్ అధికారులకు సూచించారు. తిరిగి పరీక్ష ముగిసిన అనంతరం జవాబు పత్రాలను స్ట్రాంగ్ రూమ్‌కు తరలించాలన్నారు. పరీక్ష జరిగే సమయంలో పట్టణాల్లో అన్ని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతో పాటు, 3 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అభ్యర్థుల కోసం బస్సులను సమయానుకూలంగా నడిపేలా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచిచారు. పరీక్షా కేంద్రాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ సిబ్బంది అవసరమైన మందులతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లతో అందుబాటులో ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. అభ్యర్థుల హాల్ టికెట్లో ఉన్న ఫోటోను, ఐడీ కార్డులో ఉన్న ఫొటోను పరీక్షించి అనుమతించాలని ఐడెంటిఫికేషన్ అధికారుకు సూచించారు. ఉదయం 9:30 నుంచి బయోమెట్రిక్ ద్వారా అభ్యర్థుల వేలిముద్రలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్లు, జిల్లా అధికారులు, ఐడెంటిఫికేషన్, పోలీస్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
గ్రూప్ 1 పరీక్షకు పటిష్ట బందోబస్తు..
పరీక్షకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ సురేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షాకేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, అలాగే జిరాక్స్ సెంటర్లు మూసి వేయాలని ఆదేశించారు. అభ్యర్థులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లాకు ప్రశ్నాపత్రాలు, ఓఎంఆర్ షీట్స్ : అదనపు కలెక్టర్ దీపక్ తివారి
గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష సంబంధిత ప్రశ్న పత్రాలు, ఓఎంఆర్ షీట్స్ జిల్లాకు చేరుకున్నాయని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి తెలిపారు. కలెక్టరేట్లోని స్ట్రాంగ్ రూమ్‌లో పూర్తి బందోబస్తు నడుమ భద్రపర్చినట్లు పేర్కొన్నారు. జిల్లాలో గ్రూప్ -1 సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు తమకు కేటాయించిన కేంద్రాలను ఒక రోజు ముందుగానే నిర్దారించుకోవాలని సూచించారు. షూ, మొబైల్ ఫోన్లు, ఎలక్ష్రానిక్ పరికరాలను అనుమతించబోమని, అభ్యర్థికి సంబంధించిన వస్తువులను భద్రపర్చేందుకు ఎలాంటి సౌకర్యం కల్పించడం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరీక్షల జిల్లా సమన్వయకర్త లక్ష్మీనరసింహ, జిల్లా ఖజానా అధికారి రాజేశ్వర్, ఆసిఫాబాద్ సరిల్ ఇన్స్పెక్టర్ జి. సతీష్, కలెక్టరేట్ పర్యవేక్షకులు మునావార్ షరీఫ్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
సమన్వయంతో కృషి చేయాలి..
నస్పూర్, జూన్ 7 : గ్రూప్ 1 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో డిపార్ట్మెంట్ అధికారులు, ఫ్లైయింగ్స్కాడ్, రూట్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ రాహుల్, పరీక్ష ప్రాంతీయ సమన్వయకర్త చక్రపాణితో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 27 పరీక్షా కేంద్రానలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 9,384 మంది అభ్యర్తులు పరీక్షకు హాజరుకానున్నారని చెప్పారు. డిపార్టుమెంటల్ అధికారులు, ఐడింటిఫికేసన్ అధికారులు పరీక్షకు ఒ క రోజు ముందుగానే వారికి కేటాయించిన ప రీక్షా కేంద్రాలను సందర్శించి, సీటింగ్ నిర్వహణ, తాగునీరు, సీసీ కెమెరాలు, విద్యుత్ సౌకర్యాలను పరిశీలించాలన్నారు. చిన్న నిర్లక్ష్యాన్ని కూడా సహించేది లేదని, ఎవరికి కేటాయించిన విధులు వారు సమర్థవంతంగా ని ర్వహించాలన్నారు. పరీక్ష రోజు ప్రశ్న పత్రా లు, సామగ్రి తీసుకునేందుకు రూట్ అధికారులు ఉదయం 6 గంటలకు ఉండాలని, తమ రూట్లను ఒక రోజు ముందు పరిశీలించాలని తెలిపారు. ఉదయం 10 గంటలకు అభ్యర్ధులు పరీక్ష కేంద్రంలోకి వెళ్లిన తర్వాత ఐడింటిఫికేషన్ అధికారుల విధులు ముగుస్తాయని, వారు పరీక్ష కేంద్రంలో ఉండకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

