దశల వారీగా సమస్యలు పరిష్కారం .. జడ్పీ చైర్పర్సన్

ఆసిఫాబాద్ : జిల్లాలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోవలక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలో సుమారు రూ.5కోట్ల వ్యయంతో చేపడుతున్న సైడ్ డ్రైన్ పనులకు కలెక్టర్ రాల్రాజ్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని , ఈ సమస్యను పరిష్కరించేందుకు సైడ్ డ్రైన్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమంతో పాటు గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతుందన్నారు. జిల్లా కేంద్రంలో నెలకొన్న సమస్యలను దశల వారీగా ప్రణాళిక బద్దంగా పూర్తి చేస్తామని వెల్లడించారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఏడేండ్ల కాలంలో ఆసిఫాబాద్ పట్టణం ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు, ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గాదవెణి మల్లేశ్, సింగిల్‌విండో చైర్మన్ అలీబీన్హైమద్, నాయకులు అబ్దుల్లా, రవీందర్, సలాం, జీవన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

