కోనరావుపేట : మండలంలోని మామిడిపల్లి గ్రామంలో శ్రీరామాంజనేయ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీసీతారామస్వామి శోభయాత్రను ( Shobhayatra) శ్రీరామాంజనేయ దీక్షపరులు అత్యంత వైభవంగా నిర్వహించారు. సుందరంగా ముస్తాబు చేసిన వాహనంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఉంచి పురవీధుల గుండా స్వాములు, భక్తులు భజనసంకీర్తనలతో శోభయాత్రను నిర్వహించారు.
మహిళలు స్వామివారికి మంగళహారులతో స్వాగతం పలికి పూజలు చేశారు. అర్చకులు తిరునహరి కృష్ణ మహిళలకు ఆశీర్వాదం అందించడంతో పాటు తీర్థాప్రసాదాలను అందజేశారు. ప్రధాన కూడళ్లలో డీజే పాటలతో శ్రీరామంజనేయ స్వాములు కోలాటలాడగా వీధులన్ని భక్తి పారవశ్యంతో మునిగిపోయాయి.