తాండూర్, జూన్ 22 : వర్షాలు కురవాలని వేడుకుంటూ శనివారం కొమ్ముగూడెం గ్రామంలో పోచమ్మ, గ్రామ దేవతలకు భక్తులు, స్థానికులు ప్రత్యేక పూజలు, జలాభిషేకాలు నిర్వహించారు.
విస్తారంగా వర్షాలు కురిసి చెరువులు జలకళ సంతరించుకోవాలని, పంటలు సమృద్ధిగా పండాలని, పిల్లాపాపలతో సుఖంగా ఉండాలని మహిళలు నీళ్ల బిందెలు ఎత్తుకొని ఆలయాలకు చేరుకుని విగ్రహాలకు జలాభిషేకాలు చేశారు. పసుపు-కుంకుమలతో ప్రత్యేక పూజలు చేశారు.