తలమడుగు, ఆగస్టు 7 ః ప్రభుత్వం త్వరగా లబ్ధిదారులకు స్మార్ట్‌రేషన్ కార్డులు అందజేయాలని బోథ్ ఎ మ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. గురువారం మండలంలోని సుంకిడి రైతు వేదికలో ఏర్పాటు చేసిన నూతన రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమంలోని తలమడుగు, తాంసి మండలాలకు చెందిన లబ్ధిదారులకు డెమో రే షన్ కార్డులు అందజేశారు. అనంతరం ఆత్మ చైర్మన్ అ శోక్ మాట్లాడుతుండగా.. గత ప్రభుత్వంపై చేసిన వ్యా ఖ్యలను బీఆర్ఎస్ నాయకులు ఖండించారు.
ఈ క్ర మంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే అనిల్ జాదవ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి వారిని నచ్చజెప్పడంతో వాగ్వాదం సద్దుమణిగింది. అనంతరం సుంకిడి గ్రామంలోఎక్సైజ్ శాఖ వారు నిర్వహించిన వన మహోత్సవంలో పాల్గొని కలెక్టర్ రాజర్షి షాతో కలిసి మొకలు నాటారు. ఆర్డీవో స్రవంతి, తహసీల్దార్ రాజమోహన్ పాల్గొన్నారు.