హాజీపూర్, ఆగస్టు 10 : మండలంలోని వేంపల్లి గ్రామ శివారులో ఐటీ పార్కు నిర్మించేందుకు కలెక్టర్ కుమార్ దీపక్ శనివారం స్థలాన్ని పరిశీలించారు. గ్రామ శివారులోని సర్వే నంబర్ 159లోని భూమిని పరిశీలించారు. డిప్యూటీ తహశీల్దార్ హరితను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్ఐ మంగ, ప్రభుతో పాటు శ్రీలత ఉన్నారు.
ఆకస్మిక తనిఖీ
జన్నారం, ఆగస్టు 10 : రేండ్లగూడ, కిష్టాపూర్ గ్రామాన్ని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నర్సరీ, ప్లాంటేషన్, డంప్ యార్డు, శ్మశానవాటికను పరిశీలించారు. మొక్క నాటి నీరు పోశారు. డంప్ యార్డులో వర్మికంపోస్టును తయారు చేస్తున్నారా.. లేదా అడిగి తెలుసుకున్నారు. ప్లాంటేషన్ సక్రమంగా నిర్వహిస్తున్నందుకు పంచాయతీ కార్యదర్శి ఎల్ శ్రీనివాస్‌ను అభినందించారు. ఎంపీడీవో శశికళ, ఎంపీవో జలెందర్, స్పెషల్ ఆఫీసర్ శ్రీకాంత్, కార్యదర్శులు ఎల్ శ్రీనివాస్, విశ్వశ్రీ, మాజీ సర్పంచ్ ఆశారాజ్, ఏపీవో రవీందర్, ఎంపీఎం బుచ్చన్న, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.