కార్మికుల సంక్షేమానికి పెద్దపీట
సింగరేణి కార్మికుల సంక్షేమానికి యాజమాన్యం పెద్దపీట వేస్తుందని చైర్మన్ అండ్ మేనేజిం గ్ డైరెక్టర్ బలరాం పేర్కొన్నారు. సీఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి శ్రీరాంపూర్ ఏరియాలో ఆయన పర్యటించారు. శ
- సమష్టిగా బొగ్గు లక్ష్యాలను సాధించాలి
- సింగరేణి సీఎండీ బలరాం
- నస్పూర్ కాలనీ డిస్పెన్సరీలో రూ. 33 లక్షలతో డిజిటల్ ఎక్స్‌రే సెంటర్ ప్రారంభం
సీసీసీ నస్పూర్, జనవరి 13 : సింగరేణి కార్మికుల సంక్షేమానికి యాజమాన్యం పెద్దపీట వేస్తుందని చైర్మన్ అండ్ మేనేజిం గ్ డైరెక్టర్ బలరాం పేర్కొన్నారు. సీఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి శ్రీరాంపూర్ ఏరియాలో ఆయన పర్యటించారు. శనివారం సాయంత్రం నస్పూర్ కాలనీలోని సింగరేణి డిస్పెన్సరీలో రూ.33 లక్షలతో ఏర్పాటు చేసిన నూత న డిజిటల్ ఎక్స్‌రే సెంటర్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భం గా సీఎండీని ఏరియా జీఎం సంజీవరెడ్డి, అధికారుల సంఘం అధ్యక్షుడు అబ్దుల్ ఖదీర్, గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య, ఏరియా ఉపాధ్యక్షుడు కొట్టె కిషన్‌రావు, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్‌ప్రసాద్, ఉపాధ్యక్షులు శంకర్రావు, కుమారస్వామి, నాయకులు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, టీబీజీకేఎస్ బ్రాంచ్ కార్యదర్శి పానగంటి సత్తయ్య, మాజీ ఏరియా చర్చల ప్రతినిధి పెట్టం లక్షణ్ శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ఉత్పత్తి, రక్షణ, ఓబీ, డిస్పాచ్, సంక్షేమం కోసం ఎలాంటి చర్యలకైనా వెనుకాడబోదని చెప్పారు. సంస్థ నిర్దేశిత లక్ష్యాల సాధనకు ఉద్యోగులంతా సమష్టిగా కృషి చేయాలన్నారు. రూ. 16 కోట్లు వెచ్చించి శ్రీరాంపూర్, నస్పూర్కాలనీలకు తాగు నీరు సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. సింగరేణి సంస్థ 8 రాష్ర్టాల విద్యుత్ పరిశ్రమలకు బొగ్గు సరఫరా చేస్తుందన్నారు. తనకు సీఎండీగా బాధ్యతలు అప్పగించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి జీఎం పర్సనల్ హన్మంతరావు, ఎస్వోటూ జీఎం రఘుకుమార్, డీవైపీఎం కాంతారావు, డీవైసీఎంవో డాక్టర్ రమేశ్‌బాబు, హెల్త్ ఆఫీసర్ లోక్‌నాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

