ఆసిఫాబాద్ టౌన్, జనవరి 31 : ఉద్యోగ విరమణ అనివార్యమని, శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్ఐ సుధాకర్ ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీస్ సంఘం ఆధ్వర్యంలో ఎస్ఐ సుధాకర్‌ను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. అనంతరం ఎస్పీ సుధాకర్ సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షుడు విజయ శంకర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణాప్రతాప్, ఆర్ఐ అంజన్న, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శేఖర్, డీపీవో ఏవో శ్రీనివాస్ రెడ్డి, సీసీ కిరణ్, సూపరింటెండెంట్, ఆర్.స్ఐ ఓదెలు, పోలీస్ సంఘం వైస్ ప్రెసిడెంట్ స్వామి, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది, ఎస్ఐ సుధాకర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.