నార్నూర్, డిసెంబర్ 24 : గిరిజన సంక్షేమ శా ఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ఉపాధ్యాయులను ఆదేశించారు. గాదిగూడ మండలంలోని ఝరి, గాదిగూడ గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత బా లుర పాఠశాలలను ఆకస్మీకంగా మంగళవా రం సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనంపై అధికారులను అడి గి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పట్టికతోపాటు గిడ్డంగిలో స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిత్యం వంట, స్టోర్ గది, తాగునీరు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచేలా చూడాలన్నారు. అనంతరం విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఝరి వార్డెన్ రాంకిషన్ను వేరే స్థలానికి మార్చామన్నారు. గాదిగూడ, ఝరి ప్రధానోపాధ్యాయులకు షోకాస్ నోటీసులను జారీ చేశారు. గాదిగూడ ఏఎన్ఎంను విధుల నుంచి తొలగించారు.