తాండూర్ : మండలంలోని నగరం కుంకుమయి మల్లన్న ఆలయంలో షష్టి బోనాలు( Shasti Bonalu) ఆదివారం వైభవంగా నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకుని మల్లన్న స్వామిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం బోనాలకు ప్రత్యేక అలంకరణ చేసి ఒగ్గు పూజారులతో బండారి పూజలు చేయించి స్వామివారికి నైవేద్యం సమర్పించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ ( Adilabad ) జిల్లాలోని వివిధ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని వాపోయతున్నారు. భక్తులే అన్ని వస్తువులను ఇంటినుంచే తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆరోపించారు.
ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి భక్తులకు మంచినీరు, రోడ్డు, విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు. మల్లన్న బోనాల జాతర నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ పోలీసు సిబ్బందితో కలిసి ఆలయాన్ని సందర్శించి బందోబస్తు ఏర్పాటు చేశారు.