సిర్పూర్( యూ ) : ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్( యూ) తహసీల్దార్ ఉదయకుమార్ ( Udaykumar ) మండలానికి అందించిన సేవలు మరువలేనివని జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ( AMC Chairman) కుడుమేత విశ్వనాథరావు ( Viswanath Rao) అన్నారు. తహసీల్దార్ బదిలీ సందర్భంగా శనివారం మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో శాలువాలతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న చైర్మన్ మాట్లాడుతూ తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మండల ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించారని గుర్తు చేశారు. మచ్చలేని మనిషిగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారని ప్రశంసించారు. నిస్వార్థంగా సేవలందించే ప్రభుత్వ అధికారులను ప్రజలు ఎప్పుడూ స్మరించుకుంటారని పేర్కొన్నారు.కార్యక్రమంలో వివిధ పార్టీలు, సంఘాల నాయకులు కొముర భీమ్రావు, కొమురశంకర్, కోవా దినకర్, లచ్చు ,సిబ్బంది పాల్గొన్నారు.