ఆసిఫాబాద్ అంబేద్కర్‌చౌక్, జూన్ 22 : ఖైదీలు నేరప్రవృత్తి మార్చుకోవాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి యువరాజ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సబ్ జైలును ఆయన సందర్శించారు.
ఆయన మాట్లాడుతూ క్షణికావేశంలో చేసిన తప్పులకు జీవితం నాశనం అవుతుందని, ప్రతి ఒక్కరూ శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోవాలని, జైలులో తమ ప్రవర్తను మార్చుకొని మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ ప్రేమ్‌కుమార్ ఉన్నారు.