బెల్లంపల్లి, సెప్టెంబర్ 25 : బూధఖుర్ధు గ్రామానికి చెందిన కొత్తూరి సత్యనారాయణ గ్రూప్-1 ఫలితాల్లో సత్తా చాటి కమర్షియల్ టాక్స్ అధికారిగా ఉద్యోగం సాధించాడు. హైకోర్టు డివిజన్ బెంచ్ అనుమతి ఇవ్వడంతో ప్రకటించిన టీజీపీఎస్సీ ఫలితాల్లో సత్యనారాయణ 280వ ర్యాంక్ తెచ్చుకున్నాడు.
తండ్రి శ్రీనివాస్ హైదరాబాద్లో కూలీ పనులు చేసుకుంటూ సత్యనారాయణను ఉన్నత చదువు చదివించాడు. సత్యనారాయణ గ్రూప్-1 స్థాయి ఉద్యోగం సాధించడంపై కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.