జైనూర్ : ఇకపై తహసీల్ కార్యాలయాల ( Tahsil offices ) ద్వారా మాంగ్ కుల ( Mang Caste ) ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేలా తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేయడం పట్ల కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని మాంగ్ సమాజ్ నాయకులు శనివారం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాంగ్ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు గాయక్వాడ్ తులసీదాస్ మాంగ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమం మాంగ్ సమాజ్ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు మావలే దత్త మాంగ్ మాట్లాడు తూ గతంలో ఆర్డీవో కార్యాలయాల ద్వారా కుల ధ్రువీకరణ పత్రాలు పొందడంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చేదని పేర్కొన్నారు. సకాలంలో పత్రాలు అందక విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఇబ్బందులు పడాల్సి వచ్చేదని తెలిపారు. తెలంగాణ మాంగ్ సమాజ్ న్యాయమైన డిమాండ్‌ను ప్రభుత్వం గుర్తించి జీవో జారీ చేయడం పట్ల మాంగ్ సమాజ్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.