గర్మిళ్ల నవంబర్ 2 : నేరాల నియంత్రణలో బ్లూ కోల్ట్స్, పెట్రో కార్ సిబ్బంది పాత్ర కీలకమని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం రామగుండం హెడ్ క్వార్టర్స్‌లో కమిషనరేట్ పరిధిలోని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్ సిబ్బందికి ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ డయల్ 100 కాల్స్‌కు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ప్రజలపై బాధ్యతగా మెలగాలని అనుక్షణం అందుబాటులో ఉండాలని సూచించారు.
ప్రజల్లో భద్రతాభావం పెంపొందిస్తూ నేరస్తులకు భయం కలిగించేలా బ్లూ కోల్ట్స్ సిబ్బంది కృషి చేయాలని తెలిపారు. తమ ఏరియాపై పూర్తి సమాచారం తెలిసి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం అడ్మిన్ డీసీపీ అఖిల్ మహాజన్, సీసీఆర్బీ సీఐ రాజ్‌కుమార్, బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ వర్టికల్స్ ఇన్చార్జిలు మంచిర్యాల రూరల్ సీఐ సంజీవ్, బెల్లంపలి వన్ టౌన్ సీఐ రాజు, ఐటీ కోర్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రాము, రాజేశ్, రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు.