నిర్మల్ అర్బన్, అక్టోబర్ 22: మిస్ క్వీన్ ఆఫ్ ది వరల్డ్ అందాల పోటీల్లో పాల్గొని రన్నరప్‌గా నిలిచిన నిర్మల్ పట్టణానికి చెందిన తిరునగరి రి షిత దేశంతో పాటు జిల్లాకే వన్నెను తీసుకువచ్చిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దే వాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.మిస్ క్వీన్ ఆఫ్ ది వరల్డ్ రన్నరప్ అవా ర్డు అందుకొని నిర్మల్‌కు వచ్చిన సందర్భంగా ఆదివారం పట్టణంలోని మారుతి ఇన్ లో నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు.
ఆమెను ఘ నంగా సన్మానించారు. ఎంచుకున్న మార్గంలో కఠిన సాధన చేస్తే ప్రతి ఒక్కరూ తప్పక వి జయం సాధిస్తారని అన్నారు. ఇందుకు రిషితనే ప్రతీ ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రానున్న రోజున్న మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం క్లిమామ్ వ్యవస్థాపకురాలు అల్లోల దివ్యారెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ ఆమెను ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్, రాజేంధర్, చనిగారపు నరేష్ తదితరులున్నారు.
నిర్మల్ అర్బన్, అక్టోబర్ 22: వెన్నెల డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో డైరెక్టర్ ఏ ధన్‌రాజ్ ఆధ్వర్యంలో రూపొందించిన బీఆర్ఎస్ పార్టీ జయహో ఇంద్రన్న పాటల సీడీని ఆదివారం శాస్త్రీనగర్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయం లో రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇంద్రన్న చేసిన అభివృద్ధిని వివరిస్తూ పాటల సీడీని రూపొందించిన ధన్‌రాజ్‌ను అభినందించారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో అల్లోల మురళీధర్ రెడ్డి, శనిగారపు నరేశ్, విలాస్, తదితరులున్నారు.
సోన్, అక్టోబర్ 22: నిర్మల్ మండలంలోని అనంతపేట్ గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నేతలు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షం లో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. పదేళ్లలో చేసిన అభివృద్ధికి ఆకర్షితులై, మరింత అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమని నాయకులు పేర్కొన్నారు. 30 మంది పార్టీలో చేరినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, నీలాయిపేట్ సర్పంచ్ సూరపు సాయన్న, మాజీ సర్పంచ్ గాండ్ల విలాస్, నాయకులు మురళీధర్‌రెడ్డి, చంద్రశేఖర్‌గౌడ్, తదితరులున్నారు.