కుభీర్ : ఎవరి పట్ల వివక్ష చూపకుండా సమాజంలోని పేదవారికి ఉత్తమ సేవలు ( Best services) అందించడంతో పాటు గ్రామాభివృద్ధికి కృషి చేయాలని విశ్రాంత ఉపాధ్యాయులు సూచించారు. కుభీర్ (Kubhir ) మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కందూరి సాయినాథ్ ( Sarpanch Sainath ) ను సోమవారం శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ వృద్ధులు, వికలాంగులు, సమాజంలోని అణగారిన వర్గాల కష్టసుఖాలలో పాల్గొంటూ ప్రభుత్వం అందించే ఫలాలను వారి దరి చేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు ప్యాట లక్ష్మణ్, వి.నాగేశ్వర్, మడి రాజు, దత్తాత్రి, మారుతి, జడ్పీ హైస్కూల్ హెచ్ఎం సట్ల గంగాధర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.