చెన్నూర్: రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జిల్లా పరిధిలోని మావోయిస్టు ప్రభావిత కోటపల్లి, నీల్వాయి పోలీస్ స్టేషన్లను రామగుండం పోలీస్ కమిషనర్( CP ) అంబర్ కిషోర్ ఝా (Amber Kishore Jha) సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పోలీస్ స్టేషన్ల పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాలు, సరిహద్దు ప్రాంతాల వివరాలు, గతంలో జరిగిన సంఘటనల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యలు , మావోయిస్టు సానుభూతిపరులు, మిలిటెంట్స్, మావోయిస్టుల కదలికలపై ఆరా తీశారు.అధికారులను, సిబ్బంది విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించి వారి సమస్యను తెలుసుకొని వారికీ భరోసా కల్పించాలని సూచించారు. చట్టపరిధిలో సమస్య పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. సీపీ వెంట స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఎన్ఐబీ ఇన్స్పెక్టర్ కరుణాకర్, చెన్నూర్ రూరల్ ఇన్స్పెక్టర్ సుధాకర్, నీల్వాయి ఎస్సై శ్యామ్ పటేల్ ఉన్నారు.