‘ముఖాముఖి’కి రాజేశ్వర్ ఎంపిక
జన్నారం మండలం కిష్టాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి రాథోడ్ ఈశ్వర్ పదో తరగతి ఫలితాల్లో 10 జీపీఏ సాధించి జిల్లా టాపర్‌గా నిలిచాడు.
జన్నారం, జూన్ 7 : జన్నారం మండలం కిష్టాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి రాథోడ్ ఈశ్వర్ పదో తరగతి ఫలితాల్లో 10 జీపీఏ సాధించి జిల్లా టాపర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 9న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ముఖాముఖి కార్యక్రమానికి రాథోడ్ ఈశ్వర్ ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు గుండ రాజన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి రాథోడ్ ఈశ్వర్‌తో పాటు అతని తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయుడిని సన్మానించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే 10న హైదరాబాద్‌లోని హరిహర కళా భవనంలో రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శితో పాటు ఇతర రాష్ట్ర శాఖల అధికారులు విద్యార్థులను, వారి తల్లిదండ్రులు, హెచ్ఎంలను సత్కరించి వందేమాతరం విద్యాదాత పురస్కారాలు అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఈశ్వర్‌ను ప్రధానోపాధ్యాయుడు రాజన్న, ఎంఈవో విజయ్‌కుమార్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మంగ, సభ్యులు ఉపాధ్యాయులు అభినందించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

