కోటపల్లి : మంచిర్యాల జిల్లా కోటపల్లి తహసీల్దార్‌గా రాఘవేంద్రరావు (Tahsildar Raghavendra Rao) సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ తహసీల్దార్‌గా పనిచేసిన మహేంద్రనాథ్ మంచిర్యాల జిల్లా కలెక్టరేట్‌కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో ( Prajavani ) నూతన తహసీల్దార్ ఫిర్యాదులను స్వీకరించారు . ప్రజా సమస్యలను పరిష్కరించాలని వచ్చే ప్రతి ఫిర్యాదును పరిష్కరించి ప్రభుత్వంపై బరోసా కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. మండల ప్రజలు ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రాజేందర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.