బెల్లంపల్లి, ఆగస్టు 19 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డు హన్మాన్బస్తీ ప్రజలు తమకు మిషన్ భగీరధ పైప్‌లైన్ కనెక్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బస్తీ ప్రజలు మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పైప్‌లైన్‌ను కేవలం వన్ టౌన్ పోలీస్‌స్టేషన్ వెనకాల గల్లీలో ఇవ్వకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గల్లీని మాత్రమే చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు.
గతంలో పైపులైన్ కోసం తవ్వి గుంతగా వదిలి పెట్టడంతో చిన్నపిల్లలు, వృద్ధులు అందులో పడి గాయల పాలయ్యారని తెలిపారు. పైప్‌లైన్ కోసం తవ్విన గుంతలను తమ డబ్బులతోనే పూడ్చుకున్నట్లు పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బస్తీవాసులు చేను విజయ, మాటేటి రాజ్యలక్ష్మి, మాటేటి రాధా, పసులేటి రాధ, ముదుర కోళ్ల రాజవ్వ, ముద్ర కోళ్ల లావణ్య, ఖమ్మం భూదేవి, నాగిశెట్టి రాణి, నాగిశెట్టి రమ, ఇప్పకాయల రాజేశ్వరి, కలగనూరి సరిత, మాటేటి స్వరూప, , పసులేటి వెంకటేష్ పాల్గొన్నారు.