రెబ్బెన : బెల్లంపల్లి ఏరియాలో అన్ని పదోన్నతులు రోస్టర్ ( Roster ) ప్రకారమే జరుగుతున్నాయని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి ( GM Vijayabhaskar Reddy ) అన్నారు. ఎస్టీ రోస్టర్ రిజిస్టర్ వెరిఫికేషన్ కార్పొరేట్ కమిటీ సభ్యులు శుక్రవారం బెల్లంపల్లి ఏరియాలో ( Bellampalli Area ) పర్యటించారు.
బెల్లంపల్లి ఏరియాలో విధులు నిర్వహిస్తున్న ఎస్టీ ఉద్యోగుల రోస్టర్ను కార్పొరేట్ చీఫ్ లైసెన్స్ అధికారి , ఇల్లందు ఏరియా జీఎంవి. కృష్ణయ్య తనిఖీ చేశారు. ఎస్టీఉద్యోగుల ఖాళీల భర్తీ , పదోన్నతులకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జీఎం విజయభాస్కర్ రెడ్డి కమిటీ సభ్యులకు స్వాగతం పలికిన అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏరియా ఎస్వో -2 జీఎం రాజమల్లు, కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ భాస్కరరావు ,ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు ,వర్కింగ్ ప్రెసిడెంట్ పంతుల, ఏరియా లైసెన్స్ అధికారి శ్రీరాములు, ఏరియా పర్సనల్ మేనేజర్ రెడ్డి మల తిరుపతి, డీజీఎం ఉజ్వల్ కుమార్ బెహరా ,సీనియర్ పర్సనల్ అధికారి శ్రీనివాస్ , జూనియర్ అసిస్టెంట్ అర్చన, ఏరియా ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.