మంచిర్యాల టౌన్/హాజీపూర్/దండేపల్లి/చెన్నూర్/ చెన్నూర్ రూరల్/కోటపల్లి/కాసిపేట/తాండూర్/ వేమనపల్లి/బెల్లంపల్లి రూరల్/కన్నెపల్లి/జైపూర్ : ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జిల్లాలో కొనసాగుతున్నది. ఆయా గ్రామ పంచాయతీల్లో శుక్రవారం దరఖాస్తులుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, అర్జీలు సమర్పిస్తున్నారు. 100 మంది దరఖాస్తుదారుల చొప్పున ఒక్కో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. కాగా, దరఖాస్తులను నింపే విషయంలో అధికారులు అవగాహన కల్పించారు. కొన్ని చోట్ల అధికారులు సమయపాలన పాటించకపోవడంతో ప్రజలు ఇబ్బందులుపడ్డారు. మంచిర్యాల పట్టణంలోని 36 వార్డుల్లో నియమించిన వార్డు ఆఫీసర్లు సంబంధిత వార్డుల్లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. పలువురు దరఖాస్తు ఫారాలను ఇండ్లలోకి తీసుకెళ్లారు.
వివరాలు నింపి ఇస్తామని చెబుతున్నారు. హాజీపూర్ మండలం నర్సింగాపూర్, రాపల్లి, కర్నమామిడి, పడ్తన్‌పల్లి గ్రామాల్లో ప్రజలు దరఖాస్తులను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి రవీందర్ రెడ్డి, తహసీల్దార్ సతీశ్ కుమార్, ఎంపీడీవో అబ్దుల్ హై, ఏపీవో మల్లయ్య, ఏపీఎం శ్రీనివాస్‌గౌడ్, మండల వ్యవసాయ అధికారిణి మార్గం రజిత, డిప్యూటీ తహసీల్దార్ హరిత, విద్యుత్ శాఖ ఏఈ మహేందర్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఏఈ కామేశ్వర్ రెడ్డి, ఆర్ఐలు మంగ, ప్రభు, ఎస్ఐ వెంకన్నగౌడ్, సర్పంచులు, ఎంపీటీసీ, కార్యదర్శులు, మండల నాయకులు రఫీక్, అధికారులు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. దండేపల్లి మండలం చింతపెల్లి, మాకులపేట, చెల్కగూడ, లింగాపూర్ గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల్లో అధికారులు దరఖాస్తులు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, జడ్పీటీసీ గడ్డం నాగరాణి, ఎంపీడీవో మల్లేశ్, డిప్యూటీ తహసీల్దార్ విజయ, ఆర్ఐలు చంద్రమౌళి, భూమన్న, ఎంపీవో శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచులు దేవేంద్ర, సుగుణ, అత్తె రాజవ్వ, జాడి తిరుపతి, వ్యవసాయాధికారి అంజిత్‌కుమార్, కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. చెన్నూర్ పట్టణంలోని 18 వార్డుల్లో ఒక్కో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. మున్సిపాల్ కమిషనర్ గంగాధర్ పరిశీలించారు. చెన్నూర్ మండలం సంకారం, బుద్దారం, చాకెపల్లి, సోమన్‌పల్లి గ్రామాల్లో అధికారులు దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారి కవిత, ఏపీవో గంగా భవాణీ, ఐకేపీ ఏపీఎం ప్రమీల, ఏఈవోలు సాగర్, రాజశేఖర్, వనదేవి, దివ్య, సర్పంచులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
కోటపల్లి మండలం పంగిడిసోమారం, షట్పల్లి గ్రామాల్లో ఎంపీడీవో కే భాస్కర్, ఎంపీవో అక్తర్ మోహియోద్దీన్, జనగామ, ఆలుగామ గ్రామాల్లో తహసీల్దార్ మహేంద్రనాథ్, డీటీ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్‌లు సిద్ధం తులసి, ముల్కల్ల ఉమ, గట్టు లక్ష్మణ్ గౌడ్, కుమ్మరి సంతోష్, ఎంపీటీసీలు పుప్పిరెడ్డి మొండక్క, మారిశెట్టి తిరుపతి, ఏవో మహేందర్, ఏపీవో వెంకటేశ్వర్లు, ఎస్ఐ సురేశ్, పంచాయతీ కార్యదర్శులు సత్యనారాయణ, శంకర్, శ్రీనివాస్ రెడ్డి, రాజన్న తదితరులు పాల్గొన్నారు. కాగా, పంగిడిసోమారం, జనగామ గ్రామాల్లో ఉదయం 8 గంటలకే రావాల్సిన అధికారులు ప్రశాంతంగా.. నిదానంగా.. 9 గంటల తర్వాత రావడం విమర్శలకు తావిస్తున్నది. కార్యదర్శులే అధికారులు వచ్చేదాకా దరఖాస్తులు స్వీకరించారు. కాసిపేట మండలం ముత్యంపల్లి, కోమటిచేను, కాసిపేట, బుగ్గగూడెం పంచాయతీల్లో అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
ఆయా గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ గంగారాం, ఎంపీడీవో ఎంఏ అలీం, తహసీల్దార్ బోజన్న, సర్పంచ్‌లు ఆడె బాదు, రాంటెంకి శ్రీనివాస్, దరావత్ దేవి, ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, ఎంపీవో నాగరాజు, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రత్నం ప్రదీప్, ప్రధాన కార్యదర్శి మైదం రమేశ్, పుర్ర కుమారస్వామి, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ గోలేటి స్వామి, హెచ్ఎంలు రాథోడ్ రమేశ్, సుధాకర్ నాయక్, ఏపీఎం వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ సూపర్వైజర్ రాధిక, కార్యదర్శులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తాండూర్ మండలం అచ్చలాపూర్, తాండూర్ గ్రామాలోల ప్రజలు దరఖాస్తులను సమర్పించారు.
తెల్ల రేషన్ కార్డు, ఆధార్ ఉంటే సరిపోతుందని తహసీల్దార్ రోహిత్ దేశ్‌పాండే, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీటీసీ సాలిగామ బానయ్య, ఎంపీపీ పూసాల ప్రణయ్‌కుమార్, వైస్ ఎంపీపీ దగాం నారాయణ, తాండూర్, అచ్చలాపూర్ సర్పంచులు పూదరి నవీన్‌కుమార్, దాగాం శంకరమ్మ, ఎంపీటీసీ సిరంగి శంకర్, పెర్క రజిత, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. వేమనపల్లి మండలం జిల్లెడ, ముల్కలపేట గ్రామాల్లో అధికారులు గ్రామసభలు నిర్వహించారు.
తహసీల్దార్ సదానందం, ఎంపీడీవో లక్ష్మయ్య దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ గోవింద్, వైస్ ఎంపీపీ ఆత్రం గణపతి, సర్పంచులు కొండాల్‌రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ, ఐసీడీఎస్ సూపర్వైజర్ సువర్ణ, కార్యదర్శి హరినాథ్ అంగన్వాడీలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. బెల్లంపల్లి మండలంలోని బూదాకుర్ధు, మాలగురిజాల, లింగాపూర్, లంబాడితండా ప్రజాపాలన కార్యక్ర మం నిర్వహించారు. మండల ప్రత్యేకాధికారి దుర్గాప్రసా ద్, ఎంపీడీవో డీ రాజేందర్, తహసీలాదర్ సుధాకర్, జడ్పీ వైస్ చైర్మన్ టీ సత్యనారాయణ, అధికారులు ఎస్ లిం గయ్య, వీ శ్రీనివాస్, పీ మహేశ్వర్‌రెడ్డి, సర్పంచులు కృష్ణమూర్తి, అశోక్‌కుమార్, వెంకటేశ్, రాయమల్లు, బీఆర్ఎస్ నాయకులు వీ సురేశ్, నాయకులు నాథరి స్వామి తదితరులు పాల్గొన్నారు. కన్నెపల్లి మండలం గొల్లగట్టు, పోలంపల్లి, నాయకునిపేట గ్రామాల్లో కార్యక్రమం నిర్వహించారు. గొల్లగట్టులో 113, పోలంపల్లిలో 57, నాయకునిపేటలో 177 దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ దత్తు ప్ర సాద్‌రావు, ఎంపీడీవో రాధాకిషన్ తెలిపారు. జైపూర్ మం డలంలోని ఆయా గ్రామాల్లో జడ్పీటీసీ మేడి సునీత, ఎంపీపీ గోదారి రమాదేవి, ఎంపీడీవో సత్యనారాయణ, తహసీల్దార్ రమేశ్, అధికారులు పాల్గొన్నారు.
జన్నారం, డిసెంబర్ 29 : మండల కేంద్రంలోని పొనకల్ పంచాయతీలో ప్రజాపాలన గ్రామ సభకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జూ పటేల్ హాజరయ్యారు. అర్హులందరికీ 6 గ్యారంటిలను అందిస్తామని అన్నారు. అనంతరం పొనకల్ సర్పంచ్ జక్కు భూమేశ్ ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీపీ మాదాడి సరోజన, సయ్యద్ ఇసాక్, మిక్కినినేని రాజశేఖర్, ముజఫర్ అలీఖాన్, మేకల మాణిక్యం, మచ్చ శంకరయ్య, ఫసిఉల్లా, బీ రాజన్న, హెమంత్చారి అధికారులు పాల్గొన్నారు. అలాగే మండలంలోని పొనకల్, తిమ్మాపూర్, ఇందన్‌పెల్లి, మురిమడుగు గ్రామల్లో తహసీల్దార్, ఎంపీడీవో అరుణారాణి ఆధ్వర్యంలో దరఖాస్తులు స్వీకరించారు. ఎంపీవో సిగిడి రమేశ్, రామ్మోహన్, బానుచందర్, సర్పంచ్‌లు, అధికారులు పాల్గొన్నారు.