మంచిర్యాల ఏసీసీ, మార్చి 30 : సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణకు కృషి చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఆదేశించారు. శనివారం రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోనీ డీసీపీ అశోక్ కుమార్, ఏసీపీ ఆర్ ప్రకాశ్‌తో కలిసి యూఐ, గ్రేవ్ యూఐ లాంగ్ పెండింగ్ కేసుల పరిషారం, ఎస్సీ, ఎస్టీ, విమెన్ అగైనెస్ట్, పీవోసీఎస్‌వో, ఎన్‌డీపీఎస్‌యాక్ట్, ఎన్హెచ్ఆర్సీ, ఎస్హెచ్ఆర్సీ కేసుల పరిష్కారం, మహిళా కమిషన్‌కు సంబంధించిన అప్పీల్ పిటిషన్ పెండింగ్‌లపై సమీక్ష నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ సమగ్ర సాక్ష్యాధారాలతో నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేయాలన్నారు.
అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని, పోక్సో, ఎస్సీ, ఎస్టీ గ్రేవ్ కేసులను త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ చేసి 60 రోజుల్లో పూర్తిచేసి కోర్టులో చార్జిషీట్ వేయాలని సూచించారు. ప్రతి కేసులో పారదర్శకంగా కేసును ఇన్వెస్టిగేషన్ చేయాలని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ ఆధారాలతో దర్యాప్తు చేయాలన్నారు. ఫిర్యాదులు, ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలని ఆదేశించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాశ్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.