తాండూర్ : ప్రజలను అన్ని విధాల కాపాడేందుకే ( Protect ) పోలీసులున్నారని తాండూర్ ఎస్సై కిరణ్కుమార్ (SI Kirankumar ) అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా శనివారం మంచిర్యాల జిల్లా తాండూర్ పోలీస్ స్టేషన్ లో విద్యార్థులకు ఓపెన్ హౌస్ ( Open House ) కార్యక్రమం
నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ఉపయోగిస్తున్న టెక్నాలజీ, పౌరులు పొందాల్సిన సేవలు, చట్టాల గురించి వివరించారు.
డయల్ 100, షీ టీం. సైబర్ క్రైమ్ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగే నష్టాలు, రిసెప్షన్, స్టేషన్ రైటర్, విహెచ్ఎఫ్ సిట్, టెలికాన్ఫరెన్స్, ఆయుధాలు భద్రపరచు రూమ్, సీసీ కెమెరా కమాండ్ కంట్రోల్ రూంపై అవగాహన కల్పించారు. మైనర్లు డ్రైవింగ్ చేయవద్దని, మోటర్ వాహనాల చట్టాలు, వివిధ రకాల బందోబస్తు , సమాజంలో పోలీసుల పాత్ర, కర్తవ్యాలపై విద్యార్థులకు వివరించారు.
నేర నివారణలో పోలీసుల పాత్రను తెలిపారు. ఏదైనా నేరం జరిగినప్పుడు వెంటనే ముందుగా వారికి సమాచారం అందించాలని, ఏదైనా సమస్య ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాలని చెప్పారు. పోలీసులు ఎప్పుడూ కూడా ప్రజల రక్షణ కోసమే ఉన్నారని అన్నారు. చదువు ఒక్కటే విద్యార్థుల జీవితాలను మారుస్తుందని విద్యార్థులు ఉన్నత చదువులు చదివి, తల్లిదండ్రులకు గొప్ప పేరు తీసుకురావాలని కోరారు.