నార్నూర్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ( Compensation ) అందించి రైతులను ఆదుకోవాలని ఆదిలాబాద్ ( Adilabad ) జిల్లా ఉమ్మడి నార్నూర్, గాదిగూడ మండలాల రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బీజేపీ నార్నూర్ మండల అధ్యక్షులు బిక్కు రాథోడ్ ( Bhikku Rathod ) తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.ఉమ్మడి నార్నూర్ గాదిగూడా మండలంలోని రైతులు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని, గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పంటలు నష్ట పోయారన్నారు.
నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు ప్రతి పంటను సందర్శించి, సర్వే నిర్వహించి నష్టపోయిన పంటకు ఎకరానికి యాభై వేల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రకాష్ చాళుర్కర్, మండల నాయకులు జాదవ్ దేవిదాస్, రాథోడ్ రాజబాబు , రాజు , బానోత్ శ్రీకాంత్, జాదవ్, ధర్మరక్షక్ దిలీప్, కార్యకర్తలు పాల్గొన్నారు.