మంచిర్యాలటౌన్, మే 3 : పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తడబడ్డాడు. శుక్రవారం మంచిర్యాలలో తన తండ్రి, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ జైపూర్ పవర్ ప్లాంటు వేరే రాష్ర్టానికి పోతుంటే.. తన తండ్రి వివేక్ కొట్లాడి మరీ దాన్ని పెద్దపల్లి రాష్ట్రానికి తీసుకువచ్చారని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో క్లిప్పింగ్ ఎక్స్‌లో తెగ వైరల్ అయ్యింది. పెద్దపల్లి రాష్ట్రం ఏంటి నాయనా… సింగరేణి పవర్ ప్లాంట్ పక్క రాష్ర్టానికి ఎలా వెళ్తుంది… అబద్ధ్దాలు చెప్పడం మొదలు పెట్టావా నాయ నా… కుటుంబ పాలన ప్రతినిధి… మీకు మీ కుటుంబానికి దండం అంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు.