నార్నూర్, ఆగస్టు 7 : ఇటివల కురిసిన వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని మాన్కాపూర్ శివారులో గల పారేఖాతి జలపాతం కనువిందు చేస్తున్నది.
కొండ పై నుంచి పడుతున్న నీటి అందాలు పర్యటకులను ఆకట్టుకుంటున్నాయి. పారేఖాతి జలపాతాన్ని పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దితే పర్యటకులు సేద తీర్చేందుకు అనుకులంగా ఉంటుందని అభిప్రాపడుతున్నారు.