వేతనాలు చెల్లించాలని ధర్నా
జీవో నంబరు 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ వర్కర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మంచిర్యాల కలెక్టరేట్ ముందు ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
నస్పూర్, జూన్ 10 : జీవో నంబరు 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ వర్కర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మంచిర్యాల కలెక్టరేట్ ముందు ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మానందం మాట్లాడుతూ జిల్లాలోని 8 పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో సుమారు 50 మంది కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని, వీరికి సరైన వేతనాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ప్రతి నెలా వేతనాలు చెల్లించడం లేదని, అధికారులను ప్రశ్నిస్తే బడ్జెట్ లేదని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జీవో నంబరు 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని, ప్రతి నెలా పదో తేదీలోపు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ రాహుల్కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సంపత్, రాజేశ్వరి, అనిత, మల్లేశ్వరి, సునీత, లక్ష్మి, పద్మ, ప్రేమలత, అనసూర్య, లావణ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

