ఇంద్రవెల్లి : సమాజంలో హింసా మార్గాన్ని విడిచి, శాంతియుత ( Peace ) మార్గాన్ని అనుసరించిన గౌతమ బుద్ధుడి ( Buddha ) బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని బౌద్ధ బిక్షువు శీలవాన్ అన్నారు. బుధవారం ఇంద్రవెల్లి మండలంలోని ప్రబుద్ధనగర్ కాలనీలోని బుద్ధ విహర్లో వర్షవాస్ కార్యక్రమంలో భాగంగా బుద్ధుడు , ధమ్మం గ్రంథాన్ని పఠించారు.
ఈ సందర్భంగా ఆయన గ్రంథంలోని సారాంశాన్ని బౌద్ధ అనుయాయులకు వివరించారు. ప్రజ్ఞ, కరుణ, మైత్రిలను పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ మండల మాజీ అధ్యక్షుడు సోన్కాంబే మనోహర్, సామాట్రి అశోక్ యూత్ అధ్యక్షుడు అనిల్, ఉపాధ్యక్షుడు సందీప్, బౌద్ధ అనుయాయలు సోన్కాంబ్లే గోపినాథ్, చంద్రకాంత్, బాలాజీ, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.