ఆదిలాబాద్ : ఆదిలాబాద్ ( Adilabad ) జిల్లాలో చోరీకి, గల్లంతైన సెల్ఫోన్లను ( Cellphones ) పోలీసులు స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ( SP Mahajan ) ఆదేశాలతో 15 రోజుల వ్యవధిలో వంద సెల్ఫోన్లను శుక్రవారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశం హాల్లో బాధితులకు తిరిగి అప్పగించారు. వీటి విలువ దాదాపు రూ. 13 లక్షల విలువ ఉంటుందని ఎస్పీ వెల్లడించారు.
ముఖ్యంగా రాబట్టిన మొబైల్ ఫోన్లు హర్యానా (Haryana) , మహారాష్ట్ర ( Maharastra ) లలో ఉండటం వాటిని ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో తిరిగి రాబట్టడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 800 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశామని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని పేర్కొన్నారు. బాధితులు మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే పోలీస్ స్టేషన్నుగాని https://www.ceir.gov.in అనే వెబ్సైట్లో గాని సంప్రదించాలని సూచించారు. మీసేవ సెంటర్లలో చలాన్లు కట్టవలసిన అవసరం లేదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, పట్టణ సీఐలు బి సునీల్ కుమార్, సీహెచ్ కరుణాకర్ రావు, కె ఫణిదర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ డి వెంకటి, ప్రత్యేక బృందం సభ్యులు పి గోపి కృష్ణ, ఎస్ సంజీవ్, ఎం ఎ రియాస్, మజీద్, జి త్రిశూల్, నవనీత్ రెడ్డి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.