ఖానాపూర్, అక్టోబర్ 28 : ఉట్నూర్ ఎంపీ డీవో కార్యాలయ ఆవరణలో మంత్రి తన్నీరు హరీశ్‌రావు నేతృత్వంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభకు శనివారం ఖానాపూర్ నుంచి పెద్ద సంఖ్య లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయ క్ ఆధ్వర్యంలో వెళ్లిన నాయకులు ముందు గా గాంధీనగర్‌లోని తన నివాసం నుంచి వాహ నాల ను జెండా ఊపి ప్రారంభించారు. పలు వార్డుల నుంచి కౌన్సిలర్లు, నాయకులు, మహిళలు ఉత్స హంగా వాహనాల్లో వెళ్లారు. బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు రాజగంగన్న, సురేశ్, నాయ కులు జన్నారపు శంకర్, గంగాదర్, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు ఉన్నారు.
ఖానాపూర్ రూరల్, అక్టోబర్ 28ః ఉట్నూర్‌లో జరిగిన ఆశీర్వాద సభకు ఆయా గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివెళ్లారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల్లో భారీగా జనం కదిలారు. సత్తనపల్లి సర్పంచ్ గూగ్లావత్ రమేశ్, చిన్నం రవి, రామకృష్ణ, పులివేని సత్యనారాయణ, చిలివేరి మల్లేశ్, గుమ్ముల లింగన్న, పెద్దిరాజు, గడ్డం శ్రీని వాస్, సిరిపురం మహేశ్, నర్సింగ్, బల్గం రమేశ్, ఎర్రన్న, అంజన్న, నాయకులు పాల్గొన్నారు.
కడెం, అక్టోబర్ 28 : ఉట్నూర్ మండల కేం ద్రంలో శనివారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు కడెం మండలం బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజ లు భారీగా తరలివెళ్లారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్‌నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల్లో ద్వారా తరలివెళ్లారు. కడెం మండలం నుంచి పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు జొన్నల చంద్రశేఖర్, మల్లారెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు తరలివెళ్లినట్లు తెలిపారు.
దస్తురాబాద్‌లో..
దస్తురాబాద్, అక్టోబర్ 28 : ఉట్నూర్‌లో జరిగి న ప్రజా ఆశీర్వాద సభకు పలు గ్రామాల నుంచి భారీ సంఖ్యలో ప్రజాప్రతినిధులు, నాయకు లు, కార్యకర్తలు, ప్రజలు తరలి వెళ్లారు. జై బీఆర్ఎస్ అంటూ నినాదాలు చేశారు.
పెంబి, అక్టోబర్ 28 : ఉట్నూర్‌లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల నుంచి బీఆర్ ఎస్ నాయకులు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండ ల అధ్యక్షుడు సల్లా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి భూక్యా జాన్సన్ నాయక్‌ను భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. సర్పంచ్‌లు పూర్ణచందర్ గౌడ్, సుదర్శన్, సుధాకర్, మహేందర్, బీఆర్ఎస్ నాయకులు మల్లేశ్, మహేందర్, ఇస్మాయిల్, రమేశ్, శ్రీనివాస్, విలాస్, గోవింద్, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.