కార్మిక చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి : సుంకరి సాయినాథ్
అసంఘటిత కార్మికులు తమ హక్కుల తో పాటు కార్మిక చట్టాలపై అవగాహనను కలిగి ఉండాలని డ్రీమ్ సొసైటీ ప్రతినిధి సుంకరి సాయినాథ్ పేర్కొన్నారు.
కుభీర్, నవంబర్ 20 : అసంఘటిత కార్మికులు తమ హక్కుల తో పాటు కార్మిక చట్టాలపై అవగాహనను కలిగి ఉండాలని డ్రీమ్ సొసైటీ ప్రతినిధి సుంకరి సాయినాథ్ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పార్డి-కె గ్రామంలో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO), న్యూఢిల్లీ వారి సహకారంతో డ్రీమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం అసంఘటిత రంగ కార్మికులు, ఉపాధి హామీ కూలీలు వ్యవసాయ కూలీలతో పాటు గ్రామస్తులకు కార్మిక చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ-శ్రమ్ కార్డు నమోదు మరియు సామాజిక భద్రతా పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. ఈ సందర్భంగా కార్మికులకు కార్మిక చట్టాలు, హక్కుల గురించి వివరించారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు ఈ-శ్రమ్ కార్డు నమోదు చేసుకుని దాని ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సామాజిక భద్రతా పథకాల ప్రయోజనాలు పొందవచ్చన్నారు.
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం తీరు తెన్నులను వివరించారు. గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బందెల గంగామణి సత్యనారాయణ్, పంచాయతీ సెక్రెటరీ నర్సయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ గజేందర్, ఉప సర్పంచ్ పట్టెపు పోషెట్టి, ఉపాధి కూలీలు, కార్మికులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | కివీస్‌కు దీటుగా జవాబిస్తున్న టీమిండియా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి స్కోర్ ఎంతంటే..
NHRC | తెలంగాణలో ప్రభుత్వ దవాఖానల దుస్థితిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్
Vishwambhara | ఎట్టకేలకు ఊపందుకున్న మెగాస్టార్ ‘విశ్వంభర’.. ట్రైలర్ రెడీ, రిలీజ్ డేట్ ఎప్పుడో?
లిఫ్ట్ అడిగి ఫోన్ దొంగలించేందుకు యత్నం.. యువకుడి గొంతు కోసిన దుండగుడు
జల దోపిడీని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

