Nervous Weakness | కుభీర్, మార్చి 29 : నరాల బలహీనతను (Nervous Weakness)సరైన ఆహారం, యోగా ద్వారా నయం చేసుకోవచ్చని నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వైద్యుడు డాక్టర్ సంతోష్ పేండ్కర్ సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నరాల బలహీనతతో ఎంతోమంది బాధపడుతున్న తరుణంలో ఆదివారం ఆయన కుభీర్ లో ‘నరాల బలహీనతకు ఆయుర్వేద వైద్యం’పై పత్రికా ప్రకటన విడుదల చేశారు.
అశ్వగంధ, శతావరి వంటి మూలికలు, విటమిన్ B12 ఉన్న ఆహారాలు, పాలు, బాదం, ఖర్జూరాలు తీసుకోవడం ద్వారా నరాల శక్తి పెరుగుతుందని అన్నారు. శీర్షాసనం వంటి యోగాసనాలు రక్త ప్రసరణను మెరుగుపరిచి నరాలను బలపరుస్తాయని తెలిపారు. నరాల బలహీనతకు ఆయుర్వేద చికిత్స
అశ్వగంధ (Ashwagandha)నరాలకు బలాన్ని ఇచ్చే అత్యుత్తమ మూలిక అన్నారు. అశ్వగంధ పొడిని పాలతో తీసుకుంటే నరాల బలహీనత తగ్గుముఖం పడుతుందన్నారు. శతావరి ఈ మూలిక (Shatavari) నరాల వ్యవస్థను ప్రశాంతపరిచి, బలాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
నాడీ బలానికి తైలాలు చాలా బాగా ఉపయోగపడతాయని నువ్వుల నూనె లేదా మహానారాయణ తైలంతో మసాజ్ చేసుకోవడం వల్ల నరాల నొప్పి, తిమ్మిర్లు తగ్గుతాయన్నారు. నరాల పనితీరు మెరుగుపడటానికి ఆహార నియమాలు పాటించాలని అన్నారు. బాదం, జీడిపప్పు, అక్రోట్లు, ఆకుకూరలు, అరటిపండు, బొప్పాయి పండ్లు తీసుకోవాలన్నారు. నరాలు శక్తివంతంగా ఉండటానికి విటమిన్ B12 మరియు మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు (డార్క్ చాక్లెట్లు, అవకాడో) తీసుకోవాలని సూచించారు.
ఇంటి చిట్కాలు :
ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన బాదం, ఖర్జూరం తీసుకోవడం., ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కనీసం 30-45 నిమిషాల పాటు నడక, యోగా (యోగాసనాలు) చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుందని వీటిని ప్రతి రోజు తూచా తప్పకుండా పాటించాలన్నారు.
ఆహారంలో ఉప్పు, కారం తగ్గించడం వల్ల నరాల మీద ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు. పొగ త్రాగడం నరాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని నరాల బలహీనత కలిగిన వారు పొగ తాగడానికి పూర్తిగా మానేయాలని సూచించారు. నరాల బలహీనత తీవ్రంగా ఉన్నప్పుడు, వైద్యులను సంప్రదించి సరైన చికిత్స పొందడం మంచిదన్నారు.
Shah Rukh Khan | కింగ్ ఖాన్ హాలీవుడ్ ఎంట్రీ?.. ‘ది వైట్ లోటస్’ వెబ్ సిరీస్లో షారూఖ్.!
Watch: పొలంలో కూలిన యూఏవీ.. తర్వాత ఏం జరిగిందంటే?
Sara Arjun | 1300 మందిని ఆడిషన్స్ చేశారట.. ధురంధర్లో సారా అర్జున్ ఎలా ఫైనల్ అయిందంటే..?