నిర్మల్ అర్బన్, జనవరి 19 : నిర్మల్ మండలంలోని చిట్యాల గ్రామంలో హత్యకు గురైన బాలుడు రిషి కేసును నిర్మల్ పోలీసులు ఛేదించారు. ఆదివారం నిర్మల్ ఏఎస్పీ రాజేశ్‌మీనా వివరాలను వెల్లడించారు. అడ్డిగ రాజమణి, ఆమె కుమారుడు రిషిలు కూలీ పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. రాజమణి భర్త పదేళ్ల క్రితం చెరువులో పడి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. తల్లి, కుమారుడు వేర్వేరు చోట్ల కూలీ పనులు చేసుకుని ఉపాధి పొందుతున్నారు.
ఈ క్రమంలో శుక్రవారం తల్లి, కు మారుడు వేర్వేరు చోట్ల కూలీ పనులకు వెళ్లా రు. తల్లి ఇంటికి రాగా కుమారుడు రిషి రాత్రి 11 గంటలైనా ఇంటికి రాలేదు. శనివారం ఉ దయం రిషి చిట్యాల గ్రామ శివారులోని చిం తల చెరువు వద్ద హత్యకు గురై ఉన్నాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలుప గా.. ఎస్సై లింబాద్రి కేసు నమోదు చేశారు. ఘటన స్థలాన్ని ఏఎస్పీ రాజేశ్‌మీనా, ఎస్పీ జానకి షర్మిల వెళ్లి పరిశీలించారు.
డాగ్స్కా డ్ ద్వారా అనుమానాలు తలెత్తడంతో అనుమానితుడిని పట్టుకుని విచారించగా.. నేరం ఒప్పుకున్నాడు. కాగా.. చిట్యాల గ్రామానికి చెందిన తోకల రాజేశ్వర్‌కు హోమోసెక్స్ అలవాటు ఉంది. కామవాంఛ తీర్చుకోవడానికి ఈనెల 17వ తేదీన అర్ధరాత్రి చిట్యాలకు చెం దిన రిషిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా తెలుస్తుందనే భయంతో మత్తులో బాలుడిపై అతి కిరాతకంగా బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఏఎస్పీ నేతృత్వంలోని టీం, జిల్లా డాగ్ స్కాడ్, క్రైం టీం నేరస్తుడిని పట్టుకున్నారు.