నిర్మల్ అర్బన్, పిబ్రవరి 5: ‘డీజే టిల్లు సినిమాలో రాధికగా అలరించిన సినీతార నేహాశెట్టి సోమవారం నిర్మల్‌లో సందడి చేశారు. పట్టణంలోని బస్‌డిపో పక్కన ఏర్పాటు చేసిన ఎల్వీఆర్ షాపింగ్ మాల్‌ను స్థానిక ఎమెల్యే మహేశ్వర్ రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించా రు. జ్యోతి ప్రజ్వలన చేసి, దుకాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నేహాశెట్టి మాట్లాడుతూ..రాష్ట్రంలో ఇప్పటి వరకు నిజామాబా ద్, కామారెడ్డి, జగిత్యాల్లో బ్రాంచ్‌లు ఉండ గా నాలుగో బ్రాంచ్‌ను సోమవారం నిర్మల్‌లో ప్రారంభించినట్లు తెలిపారు.
అతి తక్కువ ధరలకే అన్ని రకాల బ్రాండెడ్ వస్ర్తాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇక సినీతార నేహాశెట్టి వస్తున్న విషయం తెలుసుకున్న పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో దుకాణం వద్ద బారులు తీరారు. పట్టణ సీఐ పురుషోత్తం గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. నేహాశెట్టి కొద్దిసేపు అభిమానులతో మాట్లాడారు. సెల్ఫీ లు దిగారు. ఓ పాటకు డ్యాన్ చేశారు. నిజామాబాద్ ఎమెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజూకుమార్ రెడ్డి, మాజీ ఎమెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, అయ్యన్నగారి భూమయ్య, షాపింగ్ మాల్ నిర్వాహకులు పీ శివ ప్రసాద్, పీ ప్రణీత్ తదితరులున్నారు.