కోటపల్లి, జనవరి 23: ఆడపిల్లల సాధికారతకు విద్య మూలస్తంభం. చదువుతోనే బాలికల ఉన్నతికి మార్గం సాధ్యమవుతుంది. ఆడ పిల్లల శ్రేయస్సు, వారి విద్య పట్ల ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ఏటా జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. బాలికల విద్య కోసం కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, గురుకులాలు, గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలను ఏర్పాటు చేసి వారికి విద్యకు, బంగారు భవితకు బాటలు వేసింది. ఆడపిల్లల పట్ల వేధింపులకు పాల్పడిన వారిని, వివక్షకు గురి చేసివారిని గుర్తించి వారికి కఠిన శిక్షలు అమలు పరిచి బాలికా శ్రేయస్సుకు కృషి చేసింది. మొట్టమొదటగా 2008లో జాతీయ బాలికా దినోత్సవాన్ని ప్రారంభించారు. దేశంలో ఆడపిల్లల పట్ల వివక్షపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ జాతీయ బాలికా దినోత్సవాన్ని ప్రారంభించారు.
విద్య ద్వారా సాధికారత
బాలికా సాధికారత విద్య ద్వారానే సాధ్యమవుతుంది. ఆడ పిల్లలు చదువుకున్నప్పుడే కుటుంబం బాగుపడుతుంది. అందుకే బాలికల చదువుకు ప్రభుత్వాలు ప్రథము ప్రాముఖ్యతను కల్పించాయి. బాల్య వివాహాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆడ పిల్లలు నేడు అన్ని రంగాల్లో రాణించి విజయాలు సాధిస్తూ ముందుకెళ్తున్నారు. జిల్లా పోలీస్ శాఖ కూడా బాలికల్లో భరోసా నింపేందుకు వివిధ కార్యక్రమాలను చేపడుతున్నది. షీ టీం ద్వారా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.
విద్యనే భరోసా
బాలికలకు విద్యనందించ డమే భరోసాను కల్పి స్తుంది. ఆడపిల్లలు విద్య నభ్యసిస్తేనే ఆ కుటుంబం బాగు పడుతుంది. స్థానికంగా ఉన్న అవకాశాలును అందిపుచ్చుకొని ముందు కు సాగాలి. బాలికా విద్య కోసం ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ముందుకెళ్లాలి.
-హరిత కేజీబీవీ, ఎస్వో కోటపల్లి